లోకేష్ పట్టుదల వెనుక ఇంత కారణం ఉందా…?
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి పట్టుదలతో ముందుకు వెళ్ళడం అనేది ఎంతమాత్రం మంచిది కాదు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షల విషయంలో తప్పు చేస్తుంది అనే భావన చాలా వరకు కూడా వ్యక్తమవుతుంది. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ కు ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా సరే కొన్ని కొన్ని నిర్ణయాల విషయంలో ఆయన ప్రజలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా పదో తరగతి పరీక్షలకు సంబంధించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గట్టిగా పోరాటం చేస్తున్నారు. టిడిపిలో ఉన్న నాయకులందరూ కూడా ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలను రద్దు చేయకుండా ముందుకు వెళితే నారా లోకేష్ కి ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి జగన్ అవకాశం ఇచ్చినట్టుగానే ఉంటుందని ప్రజల్లోకి వెళ్లే విషయంలో ఇబ్బంది పడే లోకేష్ కి ఇది మంచి పరిణామం అవుతుందని వైసీపీ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరీక్షలను వాయిదా వేసిన లేకపోతే రద్దు చేసిన టిడిపి పోరాటం చేయకముందే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఇప్పుడు రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రత భారీగా ఉన్నాయి… కాబట్టి పరీక్షలు నిర్వహిస్తే కచ్చితంగా ఇబ్బంది పడతారని… ఎలా అయినా సరే వాయిదా వేయాల్సిన అవసరం ఉంటుందని లేకపోతే రద్దు చేయాల్సిన అవసరం కూడా ఉంటుందని… ఈ రెండింటిలో ఏది జరిగినా సరే అది లోకేష్ ఇమేజ్ తీసుకు వస్తుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో చూసి చూసి చూసి తప్పు చేశారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. టిడిపి నాయకులందరూ కూడా త్వరలో నిరాహార దీక్షలు కూడా ఈ విషయంలో చేసే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. టిడిపి నాయకత్వం ఈ అంశానికి సంబంధించి కీలక నేతలతో ఇప్పటికే చర్చలు జరిపిందని త్వరలోనే పోరాటం చేసే అంశానికి సంబంధించి ఒక నిర్ణయం వెల్లడించే అవకాశాలు ఉండవచ్చు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఈ అంశంలో టిడిపి పోరాటం ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. అయితే లోకేష్ ఇంత పట్టుదలగా ముందుకు వెళ్ళడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా సరే తనకు కలిసి వస్తుంది అనే భావనతోనే ఆయన ఉన్నారని అంటున్నారు.













