జగన్ నీ కల జీవితంలో నెరవేరదు
ప్రజలంతా టీడీపీ వైపు నిలిచినా జగన్ వైఖరిలో మార్పు రాలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు అన్నారు. పోలింగ్ రోజున జగన్ సృష్టించిన ఆటంకాలను ప్రజలు అధిగమించారని చెప్పారు. వైకాపా అధినేత జగన్కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆటంకాలను అధిగమించి 80 శాతం పైగా ప్రజలు ఓటు వేశారని గుర్తు చేశారు. ఓటమి తప్పదని గ్రహించి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూశారని విమర్శించారు. చంద్రబాబు చర్యలు ప్రభుత్వం కొనసాగింపే కానీ.. ఆపద్ధర్మ ప్రభుత్వం కాదని అన్నారు. ఇది ఆపద్ధర్మ ప్రభుత్వం అనడం జగన్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. మోదీ నియంతృత్వాన్ని కేసీఆర్ కుట్రలను ఓడించాలని ప్రజలు టీడీపీకి ఓటు వేశారని తెలిపారు. టీడీపీ మిషన్ 150 సీట్ల విజయానికి పెరిగిన ఓటింగ్ శాతమే నిదర్శనమన్నారు. సీఎం కావాలనే జగన్ కల ఆయన జీవితంలో నెరవేదరని లేఖలో పేర్కొన్నారు.













