మెగాస్టార్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన చంద్రబాబు
ప్రఖ్యాత సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి కొణిదెల చిరంజీవికి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభకాంక్షలు తెలియజేశారు. ట్వీట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన గతంలో చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఒక ఫొటోను పోస్టు చేశారు. స్వయంకృషితో అంచలంచెలుగా ఎదిగిన చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని స్థానం సంపాదించుకున్నారన్నారు. అశేష ప్రేక్షాకాభిమానులను సంపాదించిన చిరంజీవి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకుంటున్నానన్నారు.













