ఏపీలో తెలంగాణ సీన్ రిపీట్ కాబోతోంది
ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సీన్ రిపీట్ కాబోతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారని, అదే విధంగా ఏపీలో కూడా జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మరో మూడు నెలల్లో ప్రజలు వన్‌సైడ్ తీర్పు ఇవ్వబోతున్నారని తెలిపారు. అమ్మఒడి, రైతు భరోసా అంతా మోసమని, బటన్ నొక్కుడు ఉత్తుత్తిదేనని విమర్శించారు. వచ్చే మూడు నెలల్లో బటన్ నొక్కి మంత్రాలయం నియోజకవర్గంలో తిక్కారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించనున్నారని, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయనున్నారని అన్నారు. టీడీపీ, జనసేన పార్టీ పొత్తుతో జగన్ ప్రభుత్వం గాలికి కొట్టుకుపోతుందని తెలిపారు.













