టీడీపీ అధికార ప్రతినిధిగా దివ్వవాణి
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రముఖ తెలుగు సినీ హీరోయిన్ కె.దివ్యవాణిని నియామకం అయ్యారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు జిల్లాలోని తెనాలికి చెందిన దివ్యవాణి అసలు పేరు ఉషారాణి. బాల్యంలోనే సినీరంగ ప్రవేశం చేసిన దివ్వవాణి ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో రూపొందించిన సర్దార్ కృష్ణమరాయుడు చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ కూతురుగా నటించారు. అనంతరం అనేక తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో బాలనటిగా ప్రేక్షకులను మెప్పించిన ఆమెకు తొలిసారిగా ముత్యమంత ముద్దు అనే తెలుగు చిత్రంతో హీరోయిన్గా మారారు. పెళ్లి పుస్తకం చిత్రంలో హీరోయిన్గా అద్భుత నటనతో ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును కూడా దివ్వవాణి సొంతం చేసుకుంది.
గత ఏడాది తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆమె అతి కొద్ది రోజుల్లోనే ప్రతిపక్ష పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలను, వైఫల్యాలను ఎండగడ్డటం, వారి ఆరోపణలను తిప్పికొట్టడం ద్వారా పార్టీలో మంచిపేరు తెచ్చుకొంది. దీనితో ఎన్నికల వేళ దివ్వవాణి సేవలు మరింత అవసరమని భావించిన చంద్రబాబు కీలకమైన రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాను అప్పగించడం జరిగింది.













