ఏపీలోని వరద బాధితులకు టీడీపీ ఎన్ఆర్ఐ విరాళాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమలోని వరద బాధితుల సహాయార్థం టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నాయకులు పలువురు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టుకు విరాళలిచ్చారు. టీడీపీ దక్షిణాఫ్రికా విభాగం అధ్యక్షుడు పారా రామకృష్ణ, ఎన్ఆర్ఐ టీడీపీ కౌన్సిల్ సభ్యుడు బండారు వంశీకృష్ణ రూ.1.25 లక్షలు, ఎన్ఆర్ఐ టీడీపీ కౌన్సిల్ సభ్యుడు శ్యామ్ ప్రసాద్ కోడూరి ఆధ్వర్యంలో ఆయన సతీమణి మణి కోడూరి, అరివిల్ల రమేష్ ఇచ్చారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి కొందరు రూ.5.32 లక్షలు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్నో నుంచి టీడీపీ కౌన్సిల్ సభ్యులు దేవేంద్ర పర్వతనేని, రామకృష్ణ అన్నే, ధరణేష్ ఎడ్లవలి, రూ.1.75 లక్షలు విరాళమిచ్చారు. సాయానికి సంబంధించిన చెక్కులను కె.బుచ్చిరాంప్రసాద్, చప్పిడి రాజశేఖర్, మాజీ శాసనసభ్యులు బోడె ప్రసాద్ చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అందజేశారు.













