టీడీపీ సంచలన నిర్ణయం
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి తెలుగుదేశం పార్టీ దూరమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టం చేశారు. కుల రాజకీయాలను అంతా వెలివేయాలని, సమగ్రాభివృద్ధే టీడీపీ లక్ష్యమన్నారు. అభివృద్ధి, మంచి కోరుకునేవారు టీడీపీలో చేరుతున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. అవినీతి కాంక్షించేవారు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని విమర్శించారు. 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో సమీక్షలు పూర్తి చేసుకున్నామని, గెలుపు గుర్రాలనే నిలబెడుతున్నామనని పేర్కొన్నారు.
టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నిక కూడా వీటితోపాటు జరుగుతున్నందున.. దానికి టీడీపీ పోటీ చేయడం లేదు. ఈ స్థానానికి తనకు మద్దతు ఇవ్వాలని సిట్టింగ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు టీడీపీ అధిష్టానాన్ని కోరారు. ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదని టీడీపీ వర్గాలు తెలిపాయి.













