ఆత్మకూరులో పోటీకి టీడీపీ దూరం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేసిన తర్వాత టీడీపీ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. మరణించిన శాసనసభ్యుడి కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తే పోటీ పెట్టరాదన్న విధానానికి కట్టుబడి టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డికి టికెట్ ఇస్తున్నట్లు వైసీపీ ఇప్పటికే ప్రకటించింది.













