త్వరలో జాతీయ, రాష్ట్ర కమిటీలు : చంద్రబాబు
త్వరలో తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నెల 11 నుంచి 50 రోజుల పాటు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అతి విశ్వాసంతో వ్యవహరించ వద్దని నేతలకు సూచించారు. ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణను త్వరలో చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ వరకు చంద్రన్న బీమా దరఖాస్తుల గడుపు పెంచనున్నట్లు తెలిపారు. నంద్యాల, కాకినాడలో నేతల మంచి ప్రతిభ కనబర్చారని అన్నారు.













