ఆమరణ నిరాహార దీక్షకు భారీగా ఏర్పాట్లు
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ నిర్వహించ తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కడప జడ్పీ కార్యాలయం ఆవరణలో ఆయన దీక్షకు దిగుతున్న సందర్భంగా భారీ టెంట్లు వేస్తున్నారు. దాదాపు పది వేల మంది కూర్చునే విధంగా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన వారందరికీ ఇక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సీఎం రమేష్ తో పాటు ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చునే వీలున్నందున నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు భారీ ఎత్తున హాజరు కావాలని ప్రణాళిక రచిస్తున్నారు. సీఎం రమేష్ కడపలోనే ఉండి ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. రోజుకో నియోజకవర్గం నుంచి కార్యకర్తలు దీక్షా శిబిరానికి తరలివచ్చే విధంగా ప్రణాళిక వేసుకున్నారు.













