ఎంపీ శివప్రసాద్ కు సోనియా అభినందనలు
ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ చిత్రవిచిత్ర వేషధారణతో పార్లమెంటులో నిరసనలు తెలిపిన టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ను యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అభినందించారు. హిజ్రా వేషధారణలో వచ్చిన ఆయన పార్లమెంటు భవనం ప్రధాన ద్వారం ముందు నిరసన తెలుపుతున్న సయమంలో, గాంధీజీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న ధర్నాలో పాల్గొనడానికి సోనియా అదే ద్వారం నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న శివప్రసాద్‌ను చూసి ఆమె పలకరించారు. గుబ్ బాగా చేస్తున్నారు. మీరు మంచి యాక్టర్ అని సోనియా శివప్రసాద్‌ను ప్రశంసించారు. అందుకు ఆయన సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు.













