రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే .. తప్పుడు కేసులు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఆ పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్సభ వేదికగా మరోసారి గళమెత్తారు. ఇంధన రాకెట్ల ప్రయోగాలు చేసిన ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్ను తప్పుడు కేసులతో ఎలా నిర్బంధించారో తమ నాయకుడ్ని కూడా అలాగే అరెస్టు చేశారన్నారు. ఎంతో మంది యువనాయకులకు స్ఫూర్తినిచ్చిన నాయకుడిపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు. మరోవైపు రూ.43 వేల కోట్ల దేశ సంపదను దోచుకున్న నాయకుడు బెయిల్పై వచ్చి 10 ఏళ్లయినందుకు కొందరు సంబరాలు చేసుకుంటున్నారని రామ్మోహన్ ఎద్దేవా చేశారు.













