వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే.. ఆ మరుక్షణమే
టీడీపీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతంతో పని చేస్తుందని తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్పై ప్రజలకు మోజు తగ్గిందని, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ప్రారంభమయ్యిందన్నారు. ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నవరత్నాలు సైతం సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేయాలని సవాల్ విసిరారు. హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే ఆ మరుక్షణమే తాము చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు సహా ఇతర రాష్ట్రాలూ పోరాటాలు చేస్తుంటే సీఎం జగన్ ఎందుకు ఒత్తిడి తేలేకపోతున్నారని ప్రశ్శించారు. ప్రత్యేకహోదాపై వైసీపీకి చెందిన ఏ ఒక్క ఎంపీ కూడా గట్టిగా అడగడం లేదన్నారు. ఇది ముమ్మాటీకి సీఎం జగన్ వైఫల్యమేనని విమర్శించారు. ఆయన చేతకానితనం వల్లే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. సినీ పరిశ్రమ విషయంలో జగనే సమస్యను సృష్టించిన సినీ పెద్దలను రప్పించుకుని వారి ద్వారానే పొగిడిరచుకున్నారని ఎద్దేవా చేశారు.













