రైల్వేజోన్ కోసం రామ్మోహన్ నాయుడు దీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీల్లో ఒకటైన విశాఖకు రైల్వేజోన్ అంశంపై తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు దీక్ష చేపట్టారు. విశాఖకు రైల్వేజోన్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం రోడ్డు రైల్వేలైన్‌లో దీక్ష చేపట్టారు. రేపు ఉదయం 7 గంటల వరకూ దీక్ష కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీపై కేంద్రం కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదాతో పాటు రైల్వేజోన్ ఆంధ్రుల హక్కని అన్నారు. ఒడిశా అభ్యంతరం చెప్పకపోయినా రైల్వేజోన్‌కు కేంద్రం మోకాలడ్డుతోందని విమర్శించారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పి, ఈశన్య రాష్ట్రాలకు రాయితీలు ఇచ్చారన్నారు. ఏపీ విషయంలో బీజేపీ రాజకీయ డ్రామా ఆడుతోందని విమర్శించారు.













