ఇప్పుడు కలవడం ఏంటి…వారు ఎప్పుడో కలిశారు
తెలంగాణ నుంచి వచ్చి బురద చల్లడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఎవరు ఎంత మంది కలిసినా టీడీపీ ఏమీ చేయలేరని సృష్టం చేశారు. వైసీపీ, టీఆర్ఎస్ దోస్తీ గురించి తమకు ముందే తెలుసన్నారు. వైసీపీ, టీఆర్ఎస్లు పార్టీలు ఇప్పుడు కలవడం ఏంటి..ఏడాది నుంచే కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నారు. దేశంలో ఎవరు ఎక్కడికైనా రావొచ్చని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ లేదు, పాడు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కోసారి ఒక్కొక్కరికి కోపం వస్తుందని, ఇప్పుడు కేసీఆర్‌కు వచ్చిందని తెలిపారు. వైఎస్ షర్మిళ ఫిర్యాదుపైనా స్పందించిన ఆయన ఆమె తన కుమార్తెలాంటిదన్నారు. వ్యక్తిగతంగా తాను విమర్శించలేదని అన్నారు.













