ఆంధ్రలో ఆ అవసరం లేదు : జేసీ
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే తప్పేమీ లేదని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీ బలహీనంగా ఉంది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. అక్కడ టీడీపీ సహకారం కావాలని కాంగ్రెస్ కోరుతోంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్కు మద్దతిస్తే ఆంధ్రలో ప్రజలు కూడా హర్షిస్తారు. ఆ పార్టీ కూడా తాను గెలిస్తే నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇచ్చి న్యాయం చేస్తామంటోంది. బీజేపీ మనల్ని మోసం చేసింది. కాంగ్రెస్ చేస్తానని అంటున్నప్పుడు ఆ పార్టీకి మరో రాష్ట్రంలో సహకరిస్తే పోయేదీమీ లేదు అని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్తో పొత్తు టీడీపీకి అవసరం లేదని సృష్టం చేశారు.













