దీక్ష కొనసాగించడం ఆయన ప్రాణాలకే ప్రమాదకరం
కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 9వ రోజుకు చేరింది. ఉదయం ఆయనకు రిమ్స్ వైద్యులు, అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ రాజా నేతృత్వంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ కూడా తీశారు. చక్కెర స్థాయి, బీపీ బాగా పడిపోయాయని వైద్యులు వెల్లడించారు. రిమ్స్ వైద్యుల నివేదికను పరిశీలించిన యూఎస్ డాక్టర్ రాజా ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రమేష్ ఈ పరిస్థితుల్లో ఐసీయూలో ఉండాల్సిందని, టెంట్ కింద వైద్య పరీక్షలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ఆయన గుండెకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నందున ఏదైనా జరిగే ఇక్కడ వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్య బృందాన్ని దీక్షా శిబిరం వద్దనే ఉంచుతున్నట్లు రిమ్స్ సూపరింటెండెంట్ గిరిధర్ తెలిపారు.













