క్షీణిస్తున్న సీఎం రమేష్, బీటెక్ రవి ఆరోగ్యం
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి చేపట్టిన ఆమరణ దీక్ష ఆరవ రోజుకు చేరుకుంది. కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇరువురు దీక్షకు పూనుకున్నాడు. అయితే గత ఆరు రోజులుగా దీక్ష చేస్తుండటంతో సీఎం రమేష్, బీటెక్ రవి ఆరోగ్యం రోజురోజూకూ క్షీణిస్తోంది. ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని వైద్యులు చెప్పినా దీక్ష విరమించడానికి ఇద్దరు నేతలు ససేమిరా అంటున్నారు. ఇరువురికి వైద్య పరీక్ష చేసిన వైద్యులు షుగర్ లెవల్స్ క్రమంగా పడిపోతున్నాయని, పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందని చెబుతున్నారు. ఇరువురి ఆరోగ్యం క్షీణిచడంతో దీక్షా శిబిరం వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే ఆరోగ్యం క్షీణించినప్పటికీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయ్యే వరకు తమ దీక్షను ఆపేది లేదని వారు సృష్టం చేశారు. మరోవైపు ఉక్కు దీక్షకు పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. మంత్రి జవహర్, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, దీక్షా శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. సీఎం రమేష్, బీటెక్ రవి ఆరోగ్యం కుదట పడాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దేవుని కడపలో ప్రత్యేక పూజలు చేశారు.













