కేసీఆర్ మద్దతు జగన్ కే…హోదాకు కాదు
కేసీఆర్‌తో జగన్‌కు ఉన్న రాజకీయ ముసుగు తొలగిపోయిందని టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు ఇవ్వలేదని, ఆయన మద్దతిచ్చింది కేవలం జగన్‌కు మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఏపీకి హోదా కోసం పక్క రాష్ట్ర సీఎంగా కేసీఆర్ మద్దతిస్తుంటే చంద్రబాబుకు ఎందుకు అభ్యంతరం అని జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు పలుకుతున్నారని జగన్ అంటున్నారు. ఇటీవల సోనియా తెలంగాణ వచ్చి హోదాపై మాట్లాడితే కేసీఆర్ హెచ్చరించలేదా? విభజన హామీలన్ని కాంగ్రెస్ నేరవేరుస్తుందని చెబితే కేసీఆర్, హరీశ్‌రావు విమర్శలు చేయలేదా అని ప్రశ్నించారు. పోలవరానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు కేసులు వేశారని గుర్తు చేశారు. ఎన్నికల ఖర్చు కోసం కేసీఆర్ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకుని జగన్ పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రా వాళ్లపై కేసీఆర్ చేసిన విమర్శలు మరిచిపోయారా? అని జగన్‌ను ప్రశ్నించారు. వెయ్యి కోట్లు కోసం జగన్ ఎంత నీచానికైనా దిగజారుతారా? అంటూ ధ్వజమెత్తారు. స్వార్థ ప్రయోజనాల కోసం మోదీ, కేసీఆర్‌తో జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు.













