వైసీపీలోకి మాగుంట?
శాసన మండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యాయం లోక్సభకు పోటీ చేయలేనని ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పటికే తేల్చి చెప్పిన విషయం విదితమే. అయితే టీడీపీ అధినాయకత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లవైపు కూడా దృష్టి సారించింది. చివరి ప్రయత్నంగా మరోసారి మాగుంట కోసం ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఇదేసమయంలో వైసీపీకి చెందిన కొందరు అధినాయకులు ఏదో విషయం తేల్చాలని ఆయనపై ఒత్తిడి పెంచినట్టు సమాచారం. వీటన్నింటికీ మించి మాగుంట అనుచరగణం మన పయనం ఎంటో చెప్పండి అంటూ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అనుచరులతో సమావేశమైన ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.













