ఏపీభవన్ సాక్షిగా చంద్రబాబుపై కుట్ర
వైసీపీ, బీజేపీ కుట్ర రాజకీయాలకు ఢిల్లీలో సమావేశం నిదర్శమని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడయాతో మాట్లాడుతూ ఢిల్లీలోని ఏపీభవన్ సాక్షిగా చంద్రబాబుపై కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. జగన్పై ఉన్న కేసుల మాఫీకి కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరపున వైసీపీ ప్రచారం చేసిందని విమర్శించారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ, వైసీపీ విశప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి రాక్షస సైన్యానికి శుక్రాచార్యుడని డొక్కా వ్యాఖ్యానించారు. బీజేపీ కుట్రలను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని తెలిపారు. నాలుగేళ్లలో కేంద్రం చేసిన ఒక్క మంచి పనిలేదని దుయ్యబట్టారు. కడప ఉక్కు పరిశ్రమపై వైసీపీ ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు.













