చంద్రబాబు అడిగారనే కూల్చివేత
ప్రజావేదిక భవన్లో కలెక్టర్ల సదస్సు పెట్టడం, కూల్చివేస్తామని ప్రకటన చేయడం కక్ష సాధింపు చర్య అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు ప్రజా వేదిక ఇవ్వడం ఇష్టం లేకపోతే దానిని ఇంకో విధంగా ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రజావేదిక కూల్చివేత నిర్ణయాన్ని ప్రజలు హర్షించరని ఆయన అన్నారు. తమ నాయకుడు చంద్రబాబు అడిగారనే కూల్చివేత నిర్ణయం తీసుకున్నారని, ఇది కక్షసాధింపు చర్యేనని అన్నారు. ప్రజావేదిక కూల్చివేతపై ముఖ్యమంత్రి మరోసారి పునరాలోచించాలని సూచించారు. ప్రజావేదిక భవనం కూల్చివేత నిర్ణయం సరికాదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో వైస్ హయాలోనే కరకట్టపై అక్రమ నిర్మాణాలు వెలిసాయని ఆయన అన్నారు.













