ఆ హక్కు పవన్ కల్యాణ్ కు లేదు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రాజీనామా చేయమనే హక్కు పవన్ కల్యాణ్‌కు లేదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్, పవన్ కేంద్రం చెప్పినట్టు చేస్తున్నారని, కేంద్రానికి తొత్తులుగా మారి అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. పవన్‌కు దమ్ముంటే ప్రత్యేక హోదాపై మోదీని నిలదీయాలని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి పోరాటం చేయాల్సిన అవసరం లేదని, ఇక్కడ పోరాటం చేస్తేనే ఢిల్లీ పీఠం కదులుతోందన్నారు. చంద్రబాబును కేంద్రం టార్గెట్ చేస్తోందని అన్నారు. కేంద్రం దయతో ఏపీ ప్రభుత్వం నడవడం లేదని అన్నారు. సోము వీర్రాజు కాకి లెక్కలు చెబుతున్నారని తెలిపారు.













