సీఎం ఆదేశిస్తే విజయసాయిరెడ్డిపై పోటీ చేస్తా
తెలుగుదేశం పార్టీ తన వల్లే ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేవారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును చూసే 2014 ఎన్నికల్లో ప్రజలు ఓట్లేశారన్నారు. అమిత్ షా దర్శకత్వంలో నాలుగు పార్టీల అధ్యక్షులు పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి దండుపాళ్యం బృందానికి నాయకుడని విమర్శించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే విజయసాయిరెడ్డిపై విశాఖలో పోటీ చేసి ఆయనను 2.2 లక్షల ఓట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిస్తానని సవాల్ విసిరారు. రఘువీరారెడ్డి, జగన్, కన్నా లక్ష్మీనారాయణ వీళ్లంతా ఒక్క తానులోని ముక్కలేనని, జవియసాయిరెడ్డి పప్పులు తమ వద్ద ఉడకవన్నారు.













