ఆయన విజయసాయి రెడ్డి కాదు… జైలు సాయిరెడ్డి
మా డేటా చోరీ జరగలేదని స్వయంగా ఆధార్ సంస్థ చెబుతున్నా.. డేటా చోరీ జరిగిందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన విజయసాయి రెడ్డి కాదు.. జైలు సాయిరెడ్డి. ఏ కారణంతో 15 నెలలు జైల్లో ఉన్నారో చెప్పాలి. నెలల తరబడి జైల్లో ఉన్న జగన్, విజయసాయిరెడ్డి సిగ్గుపడాలి. ఆంధ్ర ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేందుకు జైలు స్నేహితులు ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ సీఎం అయ్యే వరకు బినామీ కంపెనీలంటే ఆంధ్ర ప్రజలకు తెలియదు. డొల్ల కంపెనీలు, బినామీలను ఏర్పాటు చేయడంతో విజయసాయి రెడ్డి సిద్ధహస్తుడు. ఆయన సహకారంతోనే జగన్ సూట్ కేసు కంపెనీలు ఏర్పాటు చేసి వేల కోట్లు దోచుకున్నారు. అలాంటి మీరు ప్రజా నేత చంద్రబాబుకు బినామీలు ఉన్నారంటూ విమర్శలు చేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అని తెలిపారు.













