తెలుగు సినీ పరిశ్రమకు ఏమైంది?
తెలుగు చిత్ర పరిశ్రమపై తెలుగుదేశం ఎమ్మెల్సీ బాబూ రాజేందప్రసాద్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్నా, పట్టించుకోవడం లేదంటూ సినీ హీరోలు, నటులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జల్లికట్టు అంశంలో తమిళ ప్రజలకు అక్కడి చిత్ర పరిశ్రమ అండగా ఉందన్నారు. టాలీవుడ్‌కు ఏమైందని ప్రశ్నించారు. పోరాడే చేప చచ్చిపోయిందా. అని నిలదీశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా, కేటీఆర్, కవిత పలువురు నాయకులు ఏపీ పోరాటానికి మద్దతు పలికితే అక్కడే ఉంటున్న తెలుగు చిత్ర పరిశ్రమలోని ఒక్కరూ కూడా దీనిపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. తమిళ నటీనటులను చూసైనా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇకనైనా ఉద్యమించకపోతే ఐదు కోట్ల ఆంధ్రులు సినీ పరిశ్రమను వెలివేస్తారని రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు.













