రెండవ రోజు రంజుగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
ఆంధ్ర రాష్ట్రంలో ప్రగతి మాట దేవుడెరుగు.. వదోపవాదాలకు కొదవలేదు. అసెంబ్లీ సమావేశంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఎలా అనే విషయాన్ని పక్కన పెట్టి తాము చెప్పిందే కరెక్ట్ అనే వాదనకు దిగే వ్యక్తులు ఎక్కువైపోతున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో రెండవ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఎంతో వాడీవేడిగా సాగాయి. వాదోపవాదాలు హద్దు మీరడంతో స్పీకర్ కొందరి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం జరిగింది.
ఎప్పటిలాగాని రూలింగ్ పార్టీ.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది అని ఆరోపిస్తూ విపక్ష ఎమ్మెల్యేలు సభలో నిరసన మొదలుపెట్టారు. సభ కంటిన్యూ కాకుండా స్పీకర్ పోడియం వద్దకు చేరుకొని వాళ్లు ఆందోళన చేపట్టారు. ప్రజలపై పెరుగుతున్న పన్నుల భారం కారణంగా.. మధ్యతరగతి వ్యక్తులు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారని.. ప్రభుత్వం వైఖరి సామాన్యుని నడ్డి విరిచే విధంగా ఉంది అంటూ వ్యాఖ్యానించడంతో పాటు నినాదాలు కూడా చేశారు.
వాయిదా తీర్మానం పై టీడీపీ సభ్యులు చర్చ జరపాలి అని పట్టుపట్టారు. పెరిగిన గ్యాస్ ధరలను దృష్టిలో పెట్టుకొని చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే దీనికి స్పీకర్ అంగీకరించకపోవడంతో..బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. వాడే కరెంట్ ..ఉండే ఇళ్లు..తేజ్ నీరు..దగ్గర నుంచి వేసే చెత్త వరకు పన్నుల పేరుతో సామాన్యుని ఈ ప్రభుత్వం బాధేస్తోంది అని ఆందోళన వ్యక్తం చేశారు.
అనూహ్యంగా టీడీపీ ఎమ్మెల్యేల నిరసనపై స్పీకర్ తన ఆగ్రహాన్ని వ్యక్తం ఆందోళన విరమించమని కోరిన స్పీకర్ మాటలను పక్కనపెట్టి టీడీపీ ఎమ్మెల్యేలు తమ నిరసనను కొనసాగించారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఈ రోజు సభ నుంచి సస్పెండ్ అయిన వారిలో కింజరాపు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, బెందాళం అశోక్, ఆదిరెడ్డి భవాని, ఏలూరి సాంబశివరావు, గణబాబు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, వెలగపూడి రామకృష్ణబాబు, గద్దె రామ్మోహన్ ఉన్నారు













