అక్కడ ప్రమాణం చేయడానికి విజయసాయిరెడ్డి వస్తారా?
విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో టీడీపీ, వైకాపా నాయకులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయానికి చేరుకున్న వెలగపూడి మాట్లాడారు. తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని ఆయన సృష్టం చేశారు. నేను విజయసాయిరెడ్డికి సవాలు విసిరితే మధ్యలో వీళ్లేవరు. నేను విజయసాయిరెడ్డిని ప్రమాణం చేయమన్నాను అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎంతో నిజాయతీగా రాజకీయాలు చేస్తున్నానన్నారు. సింహాచలం వచ్చి ప్రమాణం చేయాలని వైకాపా నేతలు అంటున్నారని, ఆ సవాలు స్వీకరిస్తున్నానని.. అక్కడ ప్రమాణం చేయడానికి విజయసాయిరెడ్డి వస్తారా? అని ప్రశ్నించారు.













