వైకాపాలోకి ఎమ్మెల్యే వంశీ ?
ఉదయమంతా బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో తిరిగారు. సాయంత్రం అయ్యేసరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత సెల్ఫోన్ ఆపేశారు. దాంతో తెలుగుదేశం పార్టీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనని వంశీమోహన్ ఇక వైకాపాలో చేరిక లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. వంశీ మాత్రం పార్టీ మారే విషయాన్ని నేరుగా ప్రకటించలేదు. గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్లో ఉన్న తన ఆస్తుల విషయంలో కొందరు ఇబ్బంది పెడుతున్నారని వంశీ తన సన్నిహితులతో తరచు చెప్పేవారు. రాష్ట్ర మంత్రి కొడాలి నానితో సాన్నిహిత్యం ఉండటంతో వైకాపాలోకి రావాలని ఆయన పలు సందర్భాల్లో ఆహ్వానించారు.













