చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి : వల్లభనేని
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో సాంకేతికను ఉపయోగించుకుని ప్రతి నియోజకవర్గంలో ఐదు నుంచి 10 వేల టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఓటనేది ప్రాథమిక హక్కుని వైసీపీ కుట్రను ప్రజలు తిప్పికొడతారని అన్నారు.













