రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై… వైసీపీ దాడులు : బాలకృష్ణ
హిందూపురం పట్టణంలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన ఘనత టీడీపీదేనని ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురం మున్సిపాలిటీలోని వార్డుల వారీగా నాయకులతో బాలకృష్ణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, ఆ పార్టీ చేసిన అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపించారు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మిలకు పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా పోయిందని, ఉరవకొండలో పాత్రికేయులపై దాడి వైసీపీ పైశాచికానికి నిదర్శనమన్నారు. ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు.













