వైసీపీలోకి మోదుగుల
గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 9న వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖారారు చేసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబుకు, శాసనసభ్యత్వానికి చేసిన రాజీనామాను శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు పంపారు. టీడీపీలో కొనసాగాలా లేక వైసీపీలో చేరాలా అన్న విషయమై కొంత కాలంగా మోదుగుల ఊగిసలాటలో ఉన్నారు. మంగళవారం కొంత మంది నేతలతో సమావేశమై తాను టీడీపీని వీడుతున్న విషయాన్ని తెలియజేశారు. తాను పార్టీని వీడడానికి తన బావ రాంకీ అయోధ్వరామిరెడ్డి ఒత్తిడి ప్రధాన కారణమని, దీంతో పాటు టీడీపీలో కూడా తనకు కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ నెల 9న వైసీపీలో చేరుతున్నానని, తనతోపాటు వచ్చే వారుంటే రావచ్చని కోరారు.













