వైకాపాలో చేరిన మేడా మల్లికార్జున రెడ్డి
కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోటస్పాండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మేడా మల్లికార్జున రెడ్డితో పాటు ఆయన అనుచరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానంటే.. ముందు టీడీపీ వల్ల వచ్చిన అన్ని పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ చెప్పారు. అందువల్ల విప్ పదవికి జనవరి 22నే రాజీనామా చేశాను. ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మెట్లో ఈ రోజు రాజీనామా పంపాను. కడప జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీకి గౌరవాన్ని తెస్తే నాకు కనీస మర్యాద ఇవ్వకుండా పార్టీ నుంచి సప్పెండ్ చేశారు అని పేర్కొన్నారు.













