ఎవరు అడ్డుకున్నా అమరావతి నిర్మాణం ఆగదు
ఎవరు అడ్డుకున్నా రాజధాని అమరావతి నిర్మాణం ఆగదని తెలుగుదేశం పార్టీ సృష్టం చేసింది. అమరాతి బాండ్ల జారీ విషయంలో బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కొట్టిపారేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చిన మోదీ మోసగించారని విమర్శించారు. కేంద్రం సహకరించకపోయినంత మాత్రాన రాజధాని నిర్మాణం ఆగదని సృష్టం చేశారు. రాజధాని అమరావతిని సాధ్యమైనంత వేగంగా నిర్మించాలన్నదే ప్రభుత్వ ఆశయమని, అందుకే అమరావతి బాండ్లను జారీ చేసిందని తెలిపారు. ఇందులో రాజకీయం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. విభజన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోయిన రాష్ట్ర బీజేపీ నేతలు పసలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.













