Dhulipalla: విధ్వంసపు ఆలోచనల నుంచి అతను బయటకు రావాలి : ధూళిపాళ్ల
జగన్ ఇప్పటికైనా విధ్వంస ఆలోచనల నుంచి బయటకు రావాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla Narendra) అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు జగన్ విధ్వంసం చేశారు. వైసీపీ అధ్యక్షుడి (YSRCP President)గా అశాంతి సృష్టించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. పోలీసులపై దాడి చేస్తే చర్యలు తీసుకోవడం తప్పా. పోలీసులు చేసింది తప్పో, కాదో నిర్ణయించేది కోర్టులు. పోలీసులకు సంబంధించి జగన్ వచ్చి రాజముద్ర వేస్తారా? జగన్పై 36 కేసులు ఉన్నాయి. రూ.43వేల కోట్లు దోచుకున్నాడని సీబీఐ (CBI) నిర్ధరించింది. ఇరాన్ (Iran) , చైనా(China), దుబాయ్ (Dubai) లాంటి దేశాల్లో అయితే, ఇలాంటి వ్యక్తికి ఉరి శిక్ష వేస్తారు. జగన్ పాలనను కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో కలిపారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ యాచిస్తున్నారు. అర్హత, సంఖ్యాబలం లేకపోయినా ప్రతిపక్ష హోదా కోరుతున్నారు. జగన్ తన విద్వేషపూరిత నడవడిక మార్చుకోలేదనడానికి తెనాలి పర్యటన ఒక ఉదాహరణ. ఇప్పటికైనా విధ్వంసపు ఆలోచనల నుంచి అతను బయటకు రావాలి అని అన్నారు.













