Bhuma Akilapriya: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిరూపిస్తే.. రాజీనామా చేస్తా
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం (Ahobilam) లో తాను అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిరూపిస్తే, రాజీనామా (Resignation) చేస్తాని టీడీపీ స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియా(Bhuma Akilapriya) అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైసీపీ నాయకులు, సాక్షి (sakshi) పత్రిక పదే పదే అబద్ధాలు చెప్పటం పరిపాటి అయ్యిందని విమర్శించారు. వైసీపీ (YCP) హయాంలో జరిగిన అక్రమాలను తాము సరిదిద్దే పనిలో ఉన్నామని, అది మింగుడుపడక తమపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.













