అవసరమైతే ఈ విషయంపై సీఎంను కలుస్తా
హిందుపురాన్ని జిల్లాగా ప్రకటించాలని సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ విషయంపై సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలుస్తానని చెప్పారు. హిందుపురంలో పేకాట, మట్కాను అధికార పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. మాట వినని అధికారులను బదిలీ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఐదుగురు మున్సిపల్ కమిషనర్లను మార్చారని మండిపడ్డారు. ఇంటి పట్టాల పంపిణీలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందన్నారు. ఆలయాలపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు.













