టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచలన నిర్ణయం
పాయకరావు పేట నియోజకవర్గంలో గత నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ది పనులు గురించి ప్రజలకు తెలియజేయడంతోపాటు వారి సమస్యలు తెలుసుకునేందుకు ఈ నెల 24వ తేదీ నుంచి మీ కోసం- మీ ఆడపడుచు కార్యక్రమం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే వంగలపూడి అనిత తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ సమకారాలు, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తల చేయూతతో గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి ఈ నాలుగున్నరేళ్లలో జరిగిందన్నారు. త్వరలో ఎన్నికలు రానున్నందున తాను చేసిన అభివృద్ధి ప్రజలకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. 24వ తేదీన పాయకరావుపేట మండలం పాల్మన్పేట నుంచి పాదయాత్రకు శ్రీకారం చుడతానన్నారు. నాలుగు మండలాల్లోని 80 పంచాయతీల్లో సుమారు 250 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుందన్నారు. పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్, షెడ్యూల్, పోస్టర్ను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.













