టీఆర్ఎస్ఎల్పీలో టీడీపీ విలీనం
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మిగిలిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అధికార టీఆర్ఎస్లో చేరారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గులాబీ పార్టీలో చేరగా, తాజాగా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలూ టీఆర్ఎస్కు మద్దతు తెలిపినట్లుయింది. ఈ క్రమంలో టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో విలీనం చేశారు. దీనికి సంబంధించిన లేఖను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు అందజేశారు.













