మహానాడులో వారసులు
తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా పెద్ద పండుగగా భావించే మహానాడు ఘనంగా ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సిద్థార్థ కళాశాల్లో ఈ పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. 2019 ఎన్నికల నాటికి ఇదే అఖరి మహానాడు కావడంతో నేతల వారసులు హంగామా చేశారు. మంత్రి పరిటాల సునీత- రవీంద్రకుమారుడు శ్రీరాం, ఎమ్మెల్సీ కరణం బలరాం తనయుడు వెంకటేశ్, రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంట్రావు కుమారుడు వెంకట సుర్యారామ మల్లిక్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తనయుడు అప్పలనాయుడు, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి తదితరులు స్టాల్స్ వద్ద సందడి చేశారు. వారిలో సెల్పీలకు అభిమానులు ఎగబడ్డారు.













