మహానాడుకు సర్వం సిద్ధం
తెలుగుదేశం శ్రేణుల పండుగ మహానాడు కు సర్వం సిద్ధమైంది. విజయవాడ కానూరులోని వీఆర్ సిద్థార్థ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఇందుకోసం సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నిర్వాహక కమిటీలన్నీ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయడంతో విజయవాడ పసుపు వర్ణాన్ని సంతరించుకుంంది. తెలుగుదేశం పార్టీ ఏర్పాడిన తర్వాత విజయవాడలో జరుగుతున్న నాలుగో మహానాడు ఇది. ఉమ్మడి రాష్ట్రంలో మూడు జరగగా, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో జరుగుతున్న మొదటి మహానాడు ఇదే. దీంతో, ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నిర్వాహకులు, సవాలుగా తీసుకొని లక్ష చదరపు అడుగుల ప్రాంగాణాన్ని అన్ని వసతులతో తీర్చిదిద్దుతున్నారు.
ఈ నెల 27, 28, 29 తేదీలలో మూడు రోజులపాట జరిగే మహానాడుకు 1.30 లక్షల మంది వస్తారని నిర్వాహక కమిటీ భావిస్తోంది. ప్రత్యేక ఆహ్వానితులు, ఆహ్వానితులు కలిపి మొత్తం 15వేల మందికి సరిపడా ఒక వీఐపీ బ్లాక్, ఒక స్పెషల్ ఇన్వైటీ బ్లాక్, ఆరు ఇన్వైటీస్ బ్లాకులుగా మొత్తం ఎనిమిది గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్వానితులు కాకుండా రోజుకు మొత్తం 40వేల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయడంలో 16 కమిటీలూ గత వారం రోజులుగా ఏర్పాట్లలో మునిగిపోయాయి.













