టీడీపీ మహానాడుకు… ఈ ఏడాది బ్రేక్
ప్రతి సంవత్సరం జరిగే టీడీపీ మహానాడు కార్యక్రమానికి ఈ ఏడాది బ్రేక్ పడింది. దానికి కారణం ఎలక్షన్ ఫలితాలు. అయితే ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు జరగాల్సి ఉంది. అయితే జూన్ 4న ఎన్నికల ఫలితాలు, అందుకు ఏర్పాట్లు, అనంతరం ప్రభుత్వం ఏర్పాటు హడావుడి ఉండటంతో వాయిదా వేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని టెలికాన్ఫరెన్స్లో అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించారు. అయితే మహానాడు మాదిరిగా అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్కు నివాళి, పార్టీ జెండాలు ఎగురవేయడం, రక్తదాన శిబిరాలు యధావిధిగా ఉంటాయని అధినేత తెలిపారు. తిరిగి ఎప్పుడు మహానాడు నిర్వహించాలి? తేదీలపై మరోసారి ప్రకటన చేద్దామని చంద్రబాబు పేర్కొన్నారు.













