బీజేపీకి వత్తాసు పలుకుతున్న… వైకాపాకు
ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీసిన బీజేపీకి వత్తాసు పలుకుతున్న వైకాపాకు తిరుపతి పార్లమెంట్ ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని తిరుపతి లోక్సభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నాలుగు పర్యాయాలు ఎంపీగా, రెండు సార్లు కేంద్రమంత్రిగా పని చేసిన తనకు మరో అవకాశం కల్పించాలని కోరారు. ఎంపీగా అవకాశం కల్పిస్తే తిరుపతి పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తానని అన్నారు. 21 మంది వైకాపా ఎంపీలు పార్లమెంట్లో ఏరోజైనా రాష్ట్ర సమస్యల గురించి ప్రశ్నించారా అని నిలదీశారు. తిరుపతి ప్రచారంలో ప్రజలు తమ సమస్యలను ఏకరవు పెడుతున్నారన్నారు. గరుడవారథి, గూడూరు ఫ్లైఓవర్, నడికుడి రైల్వేలైన్ ఇలా ఏ ప్రాజెక్టు చూసినా అసంపూర్తిగానే ఉన్నాయన్నారు.













