సీఎం చంద్రబాబుకు అభినందనలు
నలబై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలు అభినందనలు తెలియజేశారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రాంగణంలో ముఖ్యమంత్రిని కలిసిన మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ప్రతిపాటి పుల్లారావు, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు పుష్పగుచ్చం అందించారు. రాజకీయకంగా ఆయన మరింత సుదీర్ఘ ప్రయాణం చేయాలని ఆకాంక్షించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, విశాఖ (ఉత్తర) శాసనసభ్యుడు విష్ణు కుమార్ రాజు తదితరులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.













