ఎమ్మెల్సీలుగా రామసుబ్బారెడ్డి, ఫరూక్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను మాజీ మంత్రులు రామసుబ్బారెడ్డి, ఎన్.ఎం.డి.ఫరూక్‌లకు కేటాయించనున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించమని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కడపకు చెందిన రామసుబ్బారెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మంత్రివర్గ విస్తరణ సమయంలోనే ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అప్పట్లో ఆదినారాయణరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని రామసుబ్బారెడ్డి వ్యతిరేకించారు. రామసుబ్బారెడ్డికి నచ్చజెప్పే క్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి ఖరారు చేశారు.













