మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్ల వీరంగం.. చంద్రబాబు ముందే..
టీడీపీ అధినేత చంద్రబాబు కళ్ళ ముందే రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తలు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చంద్రబాబు వారిస్తున్నా వినకుండా వీరంగం సృష్టించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం గుంటూరు జిల్లా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పొన్నూరులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైనా టీడీపీ కార్యకర్తలు పక్కనే ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లోకి దూరారు. అక్కడ ఫుల్లుగా మద్యం బయటకు వస్తూ మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇది చూసి షాకైన మిగతా నేతలు కార్యకర్తలను వారించే ప్రయత్నం చేశారు. అయినా పట్టించుకోని కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చంద్రబాబును అక్కడి నుంచి సురక్షిత ప్రదేశానికి తరలించి, గొడవను ఆపి టీడీపీ కార్యకర్తలను పంపించేశారు.













