అనపర్తి లో తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి..
పొత్తులో భాగంగా అసలు నాయకులు ఖుషి గానే ఉన్నట్టు కనిపిస్తోంది కానీ గ్రౌండ్ లెవెల్ లో కొన్ని నియోజకవర్గాలలో మాత్రం అసంత స్పష్టంగా కనిపిస్తుంది.టీడీపీ – బీజేపీ – జనసేన నేతలు, క్యాడర్ మధ్య కొన్ని నియోజకవర్గాలలో బొత్తిగా పొసగడం లేదు. దీనికి తోడు ఎటువంటి మంతనాలు పూర్తికాకముందే నియోజకవర్గాలు, టికెట్లు ప్రకటించడంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. అలా తెరపైకి వస్తున్న పేర్లలో తాజాగా అనపర్తి పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పటికే కూటమిలో భాగంగా 10 ఎమ్మెల్యేలు, 6 ఎంపీ టిక్కెట్లు బుక్ చేసుకున్న బీజేపీ.. అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి వి ష్ణుకుమార్ రాజు, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, పి.గన్నవరం నుంచి అయ్యాజీ వేమ ను ఎంచుకుంది. ఈ క్రమంలో అనపర్తి కి సంబంధించిన టికెట్ సోము వీర్రాజుకు కేటాయించారు. దీంతో అనపర్తి తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారట. 2014లో టిడిపి తరఫున అనపర్తి నుంచి పోటీ చేసి గెలిచిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు తిరిగి ఈ ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా చాటుకోవాలి అని భావిస్తున్నారు. ఈ మేరకు గడిచిన ఈ నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇంత కష్టపడ్డాక కూడా సీటు దక్కకపోవడంపై అతను చాలా అసంతృప్తితో ఉన్నారు.













