దేశ రాజకీయాల్లో చంద్రబాబుది కీలకపాత్ర
దేశ రాజకీయాల్లో తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వానికి కొన్ని పార్టీలు పార్లమెంట్లో అండగా వున్నాయని ఆరోపించారు. దేశంలోని ఇతర పార్టీల సహకారంతోనే బీజేపీ పార్లమెంట్లో విభజించు పాలించు ధోరణితో ముందుకు వెళ్తోందని అన్నారు. తమిళనాడు లోని అన్నాడిఎంకే పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతుగా నిలిచినప్పటికీ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీకి అన్నాడీఎంకే సహాకరించడం లేదని ఆరోపించారు.













