వారిది దండయాత్ర కాదు.. శాంతియాత్ర
అమరావతి రైతులు చేస్తోంది దండయాత్ర కాదు, శాంతియాత్ర అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి రైతులు కత్తులు, తుపాకులు చేతపట్టి పాదయాత్ర చేయడం లేదని అన్నారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. జనాన్ని రెచ్చగొట్టి అశాంతి సృష్టించి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం వైసీపీ నాయకులు మానుకోవాలని సూచించారు. విశాఖను విజయసాయి రెడ్డి టీం ఆక్రమించుకుని నాశనం చేస్తోందన్నారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒక అసెంబ్లీ జరుగుతుంది. బాంబేలో ఒక అసెంబ్లీలో నడుస్తుంది. నాగ్‌పూర్‌లో అసెంబ్లీ నిర్వహణకు అక్కడి ప్రభుత్వం కోట్ల రూపాయల ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ప్రస్తుతం నాగ్‌పూర్‌లో అసెంబ్లీ వద్దంటున్నారు. నాగ్‌పూర్‌లో అసెంబ్లీ సమావేశాలు రద్దు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోబోతోంది అని తెలిపారు.













