ఇది సరిపోతుందా… ఇంకేమైనా కావాలా? : పట్టాభి
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో నిజమని అమెరికా ఫోరెన్సిక్ ధృవీకరించిందని తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి తెలిపారు. ఈ సందర్భంగా పట్టాభి మీడియాతో మాట్లాడుతూ మార్ఫింగ్, ఎడిటింగ్ లాంటివి ఏమీ జరగలేదని నివేదికలో ఉన్నట్లు తెలిపారు. వాట్ మిస్టర్ జగన్‌రెడ్డి, ఇది సరిపోతుందా మీకు. మీ ఎంపీపై చర్య తీసుకోవడానికి ఇంకేమైనా సాక్ష్యాలు కావాలా అని ప్రశ్నించారు. ఫోరెన్సిక్ నివేదిక లేకుండానే మాధవ్‌కు ఎలా క్లీన్ చిట్ ఇస్తారని ప్రశ్నించారు. ఎంపీ మాధవ్‌ను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వైసీపీ పార్టీలోని కామపిశాచాలను ఎంతకాలం కాపాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు పోలీసులను అడ్డంపెట్టుకుని వారి తప్పులను కప్పిపుచ్చుకుంటారని అన్నారు. ఎంపీ మాధవ్‌పై జగన్ చర్యలు తీసుకోరని తమకు తెలుసన్నారు. అందుకే అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో వీడియో టెస్ట్ చేయించినట్లు తెలిపారు. పిట్టకథలు చెబుతున్న సజ్జల దీనికేం మాట్లాడతారని నిలదీశారు. అనంతపురంలో మాధవ్ సిగ్గులేకుండా హోర్డింగ్‌లు పెట్టించుకున్నారన్నారు. మాధవ్ తీరును ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. టీడీపీ, మీడియాపై మాధవ్ ఏంది సవాల్ చేసేది అంటూ పట్టాభి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.













